గర్భిణీల్లో రక్తపోటు ప్రభావం

రక్తపోటు సమస్య అందరి కంటే గర్భిణీల్లో ప్రాణాంతకమవుతుంది. 

రక్తపోటు కారణంగా బిడ్డకు రక్త సరఫరా సరిగా జరగక గర్భంలో బిడ్డ చనిపోయే ప్రమాదము ఉంటుంది.

రక్తపోటు ఉన్న కొంతమంది స్త్రీలలో మూర్చ సమస్యలు ఎదురవుతాయి. 

రక్త సరఫరా సరిగ్గా లేని కారణంగా ఉమ్మనీరు తగ్గి ప్రాణవాయువు అందక పిల్లలలో బుద్ధిమాంద్యము , ఫిట్స్ లాంటివి తలెత్తుతాయి. 

ఈ పరిస్ధితుల్లో గర్భాశయంలో బిడ్డకు అనుకూలించనప్పుడు వైద్యులు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీసే నిర్ణయం తీసుకుంటారు. 

కొంతమంది గర్భిణీల్లో రక్తపోటు సమస్యలు గర్భధారణ సమయంలో కనిపించకపోయినా, గర్భదారణ తరువాత రక్తపోటు సమస్య వస్తుంది. 

గర్భం ధరించిన తరువాత రక్తపోటును నియంత్రించడానికి అవసరమైన పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకోవటం మంచిది. 

ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి. సూప్, క్యాన్డ్ ఫుడ్స్ వంటి ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినవద్దు. 

ప్రతిరోజూ 30 నిమిషాలు తేలిక పాటి నడక వల్ల బరువును నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించుకోవడంలో రక్తపోటు వంటి సమస్యలను నివారించడంలో మీకు సహాయపడుతుంది.