కొత్త ఫోన్ కొన్న వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనులు.

కొత్త ఫోన్ కొన్న తర్వాత బిల్లు, బాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవాలి.

ఫోన్ సర్విస్ కి తీసుకెళ్లినప్పుడు బిల్లు, బాక్స్ ఉపయోగపడతాయి.

బాక్స్ పైన ఉండే IMEI నెంబర్ నోటు చేసుకోవాలి.

లేదా ఫోన్ లో *#06# నొక్కితే IMEI నెంబర్ వస్తుంది. 

ఫోన్ పోయినప్పుడు ఫిర్యాదు ఇవ్వడానికి IMEI నెంబర్ ఉపయోగపడుతుంది.

ఫోన్‌తో వచ్చిన ఛార్జర్ నే వాడాలి.

థర్డ్ పార్టీ ఛార్జర్స్ వాడొద్దు.

బ్యాటరీ ఎప్పుడూ 20శాతం పైగానే మెయింటేన్ చేయాలి.

బ్యాటరీని జీరో పర్సెంట్‌కి తేవొద్దు.

వీలైతే మొబైల్ డేటా ఆన్‌లో పెట్టుకోవాలి. పొరపాటున ఫోన్ పోతే ట్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది.

ఫోన్ ఎప్పుడూ హై బ్రైట్ నెస్‌తో వాడొద్దు.

నైట్ టైమ్ లైట్లు ఆపేసి ఫోన్ వాడేటప్పుడు ఐ కంఫర్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే కళ్లకు మంచిది.