ఇటీవల స్పోర్ట్స్ డ్రామా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ గతంలో చాలా తక్కువగా ఉండేవి. ఉన్న వాటిల్లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయం సాధించాయి. ఇవాళ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా రాబోతుంది. ఇప్పటి వరకు బాక్సింగ్ నేపథ్యంలో మన తెలుగులో వచ్చిన, రాబోయే సినిమాలు ఇవే...

బాక్సింగ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'తమ్ముడు' సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో అన్న కోసం పవన్ కళ్యాణ్ బాక్సర్ గా మారి విజయం సాధిస్తాడు.

రవితేజ హీరోగా వచ్చిన 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇందులో హీరో తన తండ్రి, తల్లి కోసం బాక్సర్ గా విజయం సాధిస్తాడు.

నవదీప్ మొదటి సినిమా 'జై' కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సినిమాతో నవదీప్ ఇండస్ట్రీలో స్థానం ఏర్పరుచుకున్నాడు.

వెంకటేష్ కోచ్ గా, రితికా సింగ్ ప్లేయర్ గా బాక్సింగ్ నేపథ్యంలో 'గురు' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా హిందీ 'సాలా ఖదూస్' నుంచి రీమేక్ గా తెరకెక్కింది.

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో 'గని' సినిమా ఇవాళ(ఏప్రిల్ 8) రిలీజ్ కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా రానున్న 'లైగర్' సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కనుంది. ఇందులో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా నటించడం విశేషం.