భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ ప్రధాని అయిన మొదటి భారతీయుడు..మొదటి హిందువు..రిషి సునాక్ రికార్డు సాధించారు.

రిషి సునాక్‌ మాత్రమే కాదు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు  పలు దేశాల్లో కీలక బాధ్యతలు చేపడుతున్నారు. వారెవరో తెలుసుకుందాం..

పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కాస్టా కూడా భారతీయ సంతతికి చెందినవారే.  61 ఏళ్ల ఆంటోనియో  2015లో పోర్చుగల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆంటోనియా  తండ్రి ఓర్లాండో డా కోస్టా గోవా మూలాలున్న వ్యక్తి..

మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్ కూడా భారతీయ సంతతికి చెందినవారే. జుగ్నాథ్ యూపీకి చెందిన హిందూ అహిర్ కుటుంబంలో జన్మించారు. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించిన జుగ్నాథ్..2017లో మారిషస్ ప్రధానమంత్రి అయ్యారు.

2019 నుంచి మారిషస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మారిషస్ ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సింగ్ రూపన్ కూడా భారతీయ సంతతికి చెందిన వారే. రూపన్ భారతీయ ఆర్యసమాజ్ హిందూ కుటుంబానికి చెందిన వారు.

గయానా ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారతీయ సంతతికి చెందినవారే. అలీ 25 ఏప్రిల్ 1980న గయానాలో ఇండో-గినియన్ ముస్లిం కుటుంబంలో జన్మించారు.

2020 నుంచి గయానా వైస్ ప్రెసిడెంట్‌ కొనసాగుతున్న భరత్ జగదేవ్ భారత సంతతికి చెందినవారే. భరత్ జగదేవ్ భారతీయ హిందూ కుటుంబానికి చెందినవారు. జగ్‌దేవ్ తాత రాజ్ జియావాన్‌ను 1912లో బ్రిటిష్ వారు యూపీలోని అమేథీ జిల్లా నుంచి గయానాకు తీసుకెళ్లారు.

కమలా హారిస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్. అమెరికా చరిత్రలో వైస్ ప్రెసిడెంట్ అయిన మొదటి మహిళ, భారతీయ సంతతికి చెందిన మహిళ.తమిళనాడుకు చెందిన శ్యామలా గోపాలన్-జమైకన్-అమెరికన్ సంతతికి చెందిన డోనాల్డ్ జె. హారిస్ కుమార్తె..

2022 దేశాధ్యక్షుడిగా ఎన్నికైన  సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా ప్రసాద్ అలియాస్ చాన్ సంతోఖి భారతీయ సంతతికి చెందినవారు. 1959న ఇండో-సున్నీ హిందూ కుటుంబంలో జన్మించిన చంద్రికా ప్రసాద్ తాతను బ్రిటీష్ వారు బీహార్ నుంచి సురినామ్‌కు కార్మికుడిగా తీసుకెళ్లారు.

సీషెల్స్ ప్రెసిడెంట్ రాంఖేల్వాన్ కూడా భారతీయ సంతతికి చెందినవాడు. రాంఖేల్వాన్ తాత బీహార్ నివాసి..తండ్రి పేరు రాంఖేల్వాన్.

ఐర్లాండ్ లోని డబ్లిన్‌లో జన్మించిన లియో వరద్కర్ ప్రస్తుతం తానైస్టే లేదా ఐర్లాండ్ ఉప ప్రధానమంత్రిగా ఉన్నారు.  2017 నుండి 2020 వరకు టావోసీచ్ లేదా ఐర్లాండ్ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. లియో తండ్రి ముంబైలో జన్మించాడు. తరువాత 1960 లలో UKకి వెళ్లారు.