ఇదొక అందమైన ఆలయం..తాగి పారేసిన ఖాళీ బీరు బాటిల్స్ తో నిర్మించిన బుద్ధుడి ఆలయం

బీరు బాటిల్స్‌తో నిర్మించిన ఈ ఆలయాన్ని ‘మిలియన్ బాటిల్ టెంపుల్’ గా పేరొందింది. కానీ ఈ ఆలయం పేరు ‘వాట్ పా మహా చేది కేవ్’...

ఈ బీరు బాటిల్స్ ఆలయం థాయ్ లాండ్ లోని సిసాకేత్ ప్రావిన్స్ ఖున్ హాన్  ప్రాంతంలో ఉంది...

15 లక్షల బీరు బాటిల్స్ తో నిర్మించిన ఆ ఆలయ పూర్తి కావడానికి రెండేళ్లు పట్టింది..

బీచ్ లో తాగి పారేసిన బీరు బాటిల్స్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారటంతో ‘ఏం చేయాలి?సలహా చెప్పండీ ’అంటూ ప్రజల్ని కోరింది ప్రభుత్వం..

ప్రభుత్వం పిలుపుతో ‘ఆ బీరు బాటిల్స్ మాకివ్వండి దాంతో బుద్ధుడి ఆలయం కడతాం’అన్నారు బౌద్ధ బిక్షువులు..

 మీరే తెచ్చుకోండి ఆలయం నిర్మించుకోండి..  అని చెప్పిన ప్రభుత్వం 

దీంతో మీ వంతు సహాయం చేయండీ..బుద్ధ ఆలయానికి సహకరించండీ అంటూ ప్రజల్ని కోరారు బౌద్ధభిక్షువులు ..

అలా ప్రజలు తీసుకొచ్చిన ఖాళీ బీరు బాటిల్స్ తో బౌద్ధ భిక్షువులు గతంలో ఉండే బుద్ధుడి ఆలయం స్థానంలో ‘వాట్ పా మహా చేది కేవ్’ అనే పేరుతో ఆలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయం సీసాల ఆలయం పెద్ద ఫేమస్ గా మారిపోయింది. ఫోటోలు, సెల్ఫీలతో టూరిస్టు ప్లేసుగా మారిపోయింది.