ఈ ఆహారంతో పిల్లల్లో కాల్షియం లోపానికి చెక్

పిల్లల ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పదార్థాలు..

సోయాబీన్, పాలకూర, బ్రొకోలి, పెరుగు, బాదం, చీజ్, బీన్స్.

కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలలో సోయాబీన్స్ ఒకటి.. 

ప్రతీ 100 గ్రా సోయాబీన్స్ లో దాదాపు 250 ఎంజీ పైనే కాల్షియం అందుతుంది.

పాలకూరలో పోషకాలు ఎక్కువ. 

కాల్షియం లోపాన్ని నివారించడంతో పాటు విటమిన్ సి, కే, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తదితర పోషకాలు ఉంటాయి.

పిల్లల ఎదుగుదలకు తోడ్పడే మరో వెజిటబుల్ బ్రొకోలి. 

విటమిన్ సి, కే లతో పాటు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

రోజుకో స్పూన్ పెరుగు తినిపించడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించవచ్చు. 

పెరుగులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

పిల్లల ఎదుగుదలకు పెరుగు తోడ్పడుతుంది.

రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలకు తినిపించడం ఆరోగ్యకరం.

రోజుకో గుప్పెడు నానబెట్టిన బాదం పప్పుతో పిల్లల ఎముకలు దృఢంగా తయారవుతాయి.

మానసికంగా కూడా పిల్లలు బలంగా తయారవుతారు.