చల్లని ఉష్ణోగ్రతలు గుండె మరియు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి.
చన్నీటి స్నానం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రమాదం.
చల్లని నీటితో స్నానం వల్ల చర్మంలోని రక్తనాళాలు సంకోచించబడతాయి.
దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగం తగ్గుతుంది.
చల్లని గాలి కన్నా, అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానంతో శరీరంపై ఎక్కువ ప్రభావం.
చల్లని నీటితో స్నానం చేయటం వల్ల రక్తనాళాలపై భారం పడుతుంది.
చల్లని నీరు శరీరానికి తగిలిన సందర్భంలో ఒక్కసారిగా షాక్ తగిలిన భావన కలుగుతుంది.
హార్ట్ బీట్ లో సైతం తేడా వస్తుంది.
ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు చన్నీటి స్నానం చేయకుండా ఉండటమే మంచిది.
వేడి వాతావరణంలో అకస్మాత్తుగా చన్నీటి స్నానం చేస్తే హార్ట్ ఎటాక్ ప్రమాదం మరింత ఎక్కువ.
దీని కారణంగా శ్వాస ఆడకపోవడం, భయాందోళనలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.