కాఫీని ఇష్ట‌ప‌డేవారికి పరిశోధకులు శుభవార్త చెప్పారు.

ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తాగేవారికి టైప్‌ 2 డయాబెటిస్‌ ముప్పు తప్పుతుంద‌ట‌.

తాజా అధ్యయనంలో ఈ విష‌యం వెల్ల‌డైంది.

గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీతోపాటు కాఫీలో ఉండే కెఫీన్‌ అనే పదార్థం ఉంటుంది.

అది మధుమేహ ముప్పును తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

దాదాపు 10వేల మందిని పరిశోధకులు పరిశీలించారు.

రక్తంలో కెఫిన్‌ ఎక్కువగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ తక్కువగా ఉన్నాయి. 

తద్వారా వారికి టైప్‌ 2 డయాబెటిస్‌, హృద్రోగ సంబంధ వ్యాధుల ముప్పు తప్పుతున్నదని కనుగొన్నారు.

ఈ అధ్యయన ఫలితాలు ‘బీఎంజే మెడిసిన్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అలాఅని కాఫీని అతిగా తీసుకోవద్దు.