పెరుగు తిన‌డంవ‌ల్ల శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.

 మ‌న శ‌రీరం అనారోగ్య సమస్యలను చురుగ్గా ఎదుర్కోగలుగుతుంది.

జ‌లుబు, ద‌గ్గు లాంటి స‌మ‌స్యలు పెరుగుతాయ‌ని చాలామంది పెరుగు తిన‌డం మానేస్తారు.

అలాంటి స‌మ‌స్యలు త‌గ్గడానికి పెరుగే సరైన ఔషధమ‌ని నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో కొంత‌మందిని మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య వేధిస్తుంటుంది. 

 పెరుగులో ఉన్న పోషకాలు మలబద్దకం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి.

పెరుగులో కాల్షియం ఉంటుంది. శరీరంలోని కండరాలకు బ‌లం చేకూరుతుంది.

ఎముకలు పెళుసుబారకుండా దృఢంగా తయారవుతాయి.

దంత సమస్యలు కూడా దూరమవుతాయి.

పెరుగును సాధ్యమైనంత వరకు పగటిపూట మాత్రమే తీసుకోవాలి.

రాత్రిళ్లు పెరుగు తింటే మ్యూకస్ పేరుకునే ప్రమాదం ఉంది. 

 ఆస్తమా స‌మ‌స్య ఉన్నవారు మాత్రం రాత్రిళ్లు పెరుగును అస‌లే ముట్టుకోవద్దు.

ఆస్తమా రోగులు రాత్రిళ్లు పెరుగు తింటే సమస్య మరింత పెరుగుతుందంటున్నారు.