కాలీఫ్లవర్‌లో శరీరానికి మేలు చేసే విటమిన్ కె, బి6, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి.
కాలీఫ్లవర్‌లో ఉండే సల్ఫోరాఫేన్ రక్తపోటును తగ్గించి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
క్యాలీఫ్లవర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా పని చేయడానికి అవసరమైన పోషకాలు పొందడానికి సహాయపడుతుంది.
క్యాలీఫ్లవర్‌లో కేన్సర్ వంటి నయం చేయలేని వ్యాధులను నివారించడంలో సహాయపడే కొన్ని గుణాలు ఉన్నాయి.
క్యాలీఫ్లవర్‌లోని సల్ఫోరాఫేన్ కేన్సర్ మూలకణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. శరీరంలో రకారకాల కణితుల పెరుగుదలను నిరోధిస్తుంది.
కాలీఫ్లవర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ధమనుల వాపును నివారించడానికి సహాయపడుతుంది.
రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో శ్వాసకోస సమస్యలు రాకుండా ఊపిరితిత్తును కాపాడుతుంది.
ఆస్తమా పెరగడానికి కారణమయ్యే సూక్ష్మక్రిములను నివారిస్తుంది..శ్వాసప్రక్రియ మెరుగుపడేందుకు కాలీఫ్లవర్‌ని క్రమం తప్పకుండా తీసుకోవాలి..