కళ్లముందే కన్నబిడ్డలను  కోల్పోతే ఆ తల్లిదండ్రుల  బాధ వర్ణణాతీతం. అలా తమ కళ్లముందే బిడ్డలను కోల్పోయిన కొందరు సినీ తారల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఎన్టీఆర్ పెద్దకొడుకు  రామకృష్ణ చిన్నవయసులోనే అనారోగ్యంతో మరణించాడు.

హరికృష్ణ పెద్దకొడుకు  జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కొన్నాళ్లకు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు.

గొల్లపూడి మారుతీరావు కొడుకు శ్రీనివాస్ ఓ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు వైజాగ్ బీచ్‌లో పడి మృతిచెందాడు.

పరుచూరి వెంకటేశ్వరరావు కొడుకు రఘుబాబు అనారోగ్యంతో మరణించాడు.

కమెడియన్ బాబు మోహన్ కొడుకు పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కోట శ్రీనివాసరావు తనయుడు ప్రసాద్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

ప్రభుదేవా కొడుకు చిన్నవయసులోనే మృతిచెందాడు.

దర్శకుడు తేజ కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు.

నటుడు ప్రకాశ్ రాజ్ కొడుకు అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు.