లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత గురించి అడగడంతో నాగ చైతన్య సీరియస్ అయ్యారు.
సమంతతో విడాకులపై అధికారికంగానే ప్రకటన చేశాం. దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అన్నారు.
ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు జీవిస్తున్నాం. సమంత దారి సమంతదే, నా దారి నాదే. ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేను అన్నారు.
ప్రతిసారి నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతుంటే నాకు
అసహనాన్ని కలిగిస్తుంది
అన్నారు.
నాపై వస్తున్న రూమర్స్‌ని నేను అస్సలు పట్టించుకోను అని, వాటి గురించి ఆలోచించే టైం నాకు లేదని తెలిపాడు.
సమంతతో భవిష్యత్తులో కలిసి నటిస్తారా అని అడిగితే.. అది జరగదు, ఒకవేళ జరిగితే అది అద్భుతమే అని చెప్పాడు చైతూ.