చార్లీ చాప్లిన్. బహుముఖ ప్రజ్ఞాశాలి..రచయిత, గాయకుడు. యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు..

చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీతో తనకే ప్రత్యేకమైన నడక.. అల్లరి, అమాయక చేష్టలతో కడుపుబ్బ నవ్వించే చాప్లిన్ జయంతి..ఏప్రిల్ 16

ప్రపంచాన్ని తన హాస్యంతో నవ్వించిన చార్లీ చాప్లిన్ జీవితం కష్టాల మయంగానే సాగింది..

చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16 వ తేదీన ఇంగ్లండ్‍లోజన్మించాడు.. బాల్యంలో బతుకుతో పోరాటం చేశారు. చార్లీచాప్లిన్ చిన్నతనంలో తినడానికి తిండి కూడా లేక ఎంతో ఇబ్బందిపడ్డారు.

బంధువులు ఆయన పట్ల చూపిన వివక్షే ఆయన్ను ప్రపంచ నవ్వుల రాజుని చేసింది..

11 ఏళ్ల వయస్సు కూలి నాలి చేసి పొట్టపోసుకునేవాడు. మార్కెట్‍లోనో, పార్కులలోనో పడుకునేవారు.

చాప్లిన్ మూడేళ్ల వయస్సులోనే మిమిక్రీ..ఐదేళ్లకు స్టేజి మీదకి ఎక్కి పాట పాడిన ఘనత.  నట వృత్తిలోకి వచ్చినా  వేషాలు వరసగా దొరికేవి కావు.

1904 నాటికి మంచి నటుడుగా పేరు వచ్చింది. 1910-1913 మధ్యకాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలిస్తూ పర్యటించాడు.

1914 సంవత్సరమంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాలలో నటించాడు.‘మేకింగ్ ఏ లవ్’ అని సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించారు.

మూకీలతో మ్యాజిక్ చేసిన చాప్లిన్ తరువాత తన మాటలతోనూ ప్రేక్షకులను రంజింప చేశారు.

ఆ నాటి డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ పై చాప్లిన్ రూపొందించిన వ్యంగ్య చిత్రం ‘ద గ్రేట్ డిక్టేటర్’ ఆయనకు మంచి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి.

ఆయన మూవీలలో The kid సూపర్ అనే చెప్పాలి. బాధను కూడా అంత గొప్పగా చేసి మనస్సులో దోచేశారు చాప్లిన్.

1977లో డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ రోజునే మరణించాడు. చాప్లిన్ కడదాకా తన నవ్వులతో చుట్టూ ఉన్నవారిని ఆనందింప చేశారు.

అందరిని నవ్వించిన చాప్లిన్ జీవితం కష్టాల మయం.. చార్లి చాప్లిన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచాద్భుతాల్లో ఒకరు.