కొందరు అరికాలు నొప్పితో బాధపడుతుంటారు.
ఉదయం పాదాన్ని నేలమీద మోపగానే నొప్పి పడుతుంటుంది.
ప్రధాన కారణం.. పాదం అడుగున వేళ్లు, మడమ ఎముకతో కలిసి ఉండే ధృడమైన కణజాలం వాయటం.
దీన్నే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు
గర్భధారణ సమయంలో బరువు పెరగడం, సరైన షూ వేసుకోకపోవడం వల్ల మగవారికన్నా మహిళలకు దీని ముప్పు ఎక్కువ.
కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్లాంటార్ ఫేషియైటిస్‌ను నివారించుకోవచ్చు.
బరువు అదుపులో ఉంటే పాదం మీద తక్కువ భారం పడుతుంది.
పాదాల మధ్య ఒంపునకు మంచి దన్ను కల్పించే మెత్తటి షూ, చెప్పులు ధరించాలి.
పరుగెత్తడం, నడవడం వంటి వ్యాయామాలు చేసేవారు ముందుగా పాదాలను కాస్త సాగదీసే సన్నద్ధత వ్యాయామాలు చేయాలి.
వీలైతే పాదం మీద ఎక్కువ భారం పడకుండా ఈత, సైకిల్ తొక్కడం వంటివి ఎంచుకోవాలి.