రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో బెరా గ్రామం..

50 ఏళ్ల క్రితం కుంభాల్‌గడ్‌ జాతీయపార్కు నుంచి తప్పించుకుని బెరా గ్రామ ప్రాంతం చేరుకున్న 6 చిరుతలు

బెరా గ్రామ ప్రాంతాలల్లోని గుహలు,అటవీ ప్రాంతాలను ఆవాసంగా చేసుకుని జీవిస్తున్న చిరుతలు..

ఆ ప్రాంతాల్లోనే సంతానాన్ని వృద్ధి చేసుకున్న చిరుతల్ని దైవంగా భావిస్తున్న బెరా గ్రామంలోని రబారి జాతి ప్రజలు

2020నాటికి 50-60కి పెరిగిన చిరుతల సంఖ్య..ప్రపంచంలో అత్యధికంగా చిరుతలున్న గ్రామంగా బెరా గుర్తింపు..

జవాయ్‌ లెపర్డ్ కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించిన అటవీశాఖ..

రోడ్లు, పొలాలు, బావులు, కొండల వద్ద స్వేచ్ఛగా తిరుగాడే చిరుతలు..

మేక,గొర్రె,ఆవు, గేదెలను తింటే అది దైవ బలిగా భావిస్తున్న బెరా గ్రామస్తులు..

వన్‌ ధన్‌ యోజన పథకం కింద గ్రామస్తుల జంతువులు చనిపోతే పరిహారం అందిస్తున్న ప్రభుత్వం..

బెరా గ్రామంలోని ఆలయాల్లో చిరుత బొమ్మలు పెట్టుకుని వాటిని దైవంలా పూజిస్తున్న బెరా గ్రామస్తులు..