నిజమైన మనుషులను పోలిన మర మనుషుల్ని ‘హ్యూమనాయిడ్ రోబో’లు అంటారు.
కానీ అసలు ఇది రోబోనా? మనిషా? అని గుర్తుపట్టేలేకపోతున్నాం అంటే అది కచ్చితం ‘జియా జియా’ రోబోనే అనాలి..
అందం అంతా రాశి పోస్తే నిలువెత్తు మనోహరం రూపం ఈ జియా జియా రోబో..
అందుకేనేమో చైనాకు చెందిన ఈ రోబోను చైనీయులు సౌందర్య దేవతగా పిలుస్తున్నారు..
అబ్బాయిలను కట్టిపడేసే అందం జియా ‘మర’కాంతది..
అమ్మాయిలు కూడా ఈర్ష్యపడే అద్భుత సౌందర్యం జియాదే అన్నట్లుగా ఉంటుంది..
ఎవరైనా ఏదైనా మాట్లాడితే తేనెలు ఒలికినంత తియ్యగా సమాధానం చెబుతుందీ జియా రోబో..
కొత్తవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల నుంచి కొన్ని హావభావాలు, మాట్లాడే విధానం నేర్చుకుంటుంది కూడా.
ఇంత అందమైన ఈరోబోని త్వరలోనే ఇది అచ్చం మనుషుల్లా ఏడవగలిగేలా, నవ్వగలిగేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు శాస్త్రవేత్తలు.