అలా చేస్తే మీ ఓటు రద్దు.

మీపై కేసు కూడా నమోదు చేస్తారు.

పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం నేరం.

పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే సమయంలో ఎవరైనా సెల్ఫీ దిగితే ఆ ఓటును రద్దు చేస్తారు.

ఎవరైనా సెల్ఫీ దిగినట్లు అధికారులు గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తారు.

సెల్ఫీ దిగిన ఓటరు ఓటును 17-ఏలో లిస్ట్ చేస్తారు.

ఆ తర్వాత ఓట్ల లెక్కింపు సమయంలో వారి ఓటును పరిగణలోకి తీసుకోరు.

ఆ ఓటును రద్దు చేస్తారు.

పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరమని నిబంధనల్లో ఉంది.

ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలి, వినిగియోంచుకోవాలి.