మనసానమః షార్ట్ ఫిలిం డైరెక్టర్‌ని అభినందించిన సీఎం జగన్
మనసానమః షార్ట్ ఫిలింతో ప్రేక్షకులని మెప్పించాడు యువ డైరెక్టర్ దీపక్ రెడ్డి.
2020 జనవరిలో విడుదలైన మనసానమః షార్ట్ ఫిలిం ఇప్పటివరకు ఏకంగా 513 అవార్డులు అందుకుని ప్రపంచంలోనే అత్యధిక అవార్డులు అందుకున్న లఘుచిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించింది.
మనసానమః షార్ట్ ఫిలింని చూసి ఇప్పటివరకు ప్రేక్షకులు, పలు సినీ ప్రముఖులు డైరెక్టర్ దీపక్ రెడ్డిని అభినందించగా తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా దీపక్ ని అభినందించారు.