శరీరంతో పాటే నిలిచిపోయి ఉండే టాటూలకు అన్ని దేశాల్లో అనుమతి లేదు.

ఒకప్పుడు పచ్చబొట్టు.. ఇప్పుడదే ట్రెండీగా టాటూ అయిపోయింది.

ఇప్పటికీ  జపాన్‌లోని కొన్ని స్విమ్మింగ్ పూల్స్, హోటల్స్, స్పాలు, పబ్లిక్ బాతింగ్ ఏరియాల్లో టాటూలు నిషేదం.

2015లోనే ఇరాన్ టాటూలను నిషేదించింది. ప్రత్యేకించి ఇది పాశ్చాత్య సంస్కృతి అంటూ స్పైక్‌డ్ హెయిర్ లాంటి వాటికి అనుమతి నిరాకరించింది. 

టాటూలు శరీరాన్ని పాడు చేస్తాయని భావిస్తుంది యూఏఈ. అది కూడా ఇస్లామిక్ ప్రక్రియను వ్యతిరేకించినట్లే అవుతుందని భావిస్తారు. 

ఇస్లామిక్ లానే అప్లై అవుతుండటంతో టాటూలను దూరం పెట్టేశారు టర్కీలో. 

షాంగై, బీజింగ్ లతో పలు రూరల్ ఏరియాల్లో మినహాయిస్తే టాటూలకు చైనాలో అనుమతి లేదు. 

వియత్నాంలోనూ క్రిమినల్స్, గ్యాంగ్ స్టర్స్ మాత్రం టాటూలు వేయించుకుంటుంటారు. 

శ్రీలంకలో టాటూలు నిషేదం ఎంతలా ఉంటుందంటే.. ఓ బ్రిటిష్ మహిళను టాటూల కారణంగా అరెస్టు చేసింది. 

విదేశాలకు వెళ్లాలనుకునేవారు టాటూలు వేయించుకోవడం ఎంతవరకూ కరెక్ట్ అనేది మీరే ఆలోచించుకోండి. శరీరంలో బయటకు కనిపించేలా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోండి.