జోషిమ‌ఠ్‌లో ఇళ్ల‌కు బీట‌లు వారుతున్నాయి. 

ఆరు వంద‌ల‌కుపైగా ఇళ్ల‌కు ప‌గుళ్లు వ‌చ్చాయి. 

స్థానిక ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. 

ఉత్త‌రాఖండ్‌లోని ఆథ్యాత్మిక కేంద్రాల్లో జోషీమ‌ఠ్ ఒక‌టి. 

ఉత్త‌రాఖండ్‌లోని హిమాలయా సానువుల్లో ఓ చిన్న ప‌ట్ట‌ణమే జోషీమ‌ఠ్‌. 

బ‌ద్రీనాథ్ క్షేత్రాన్ని శీతాకాలంలో మూసివేసిన త‌ర్వాత బ‌ద్రీనాథుడిని ఇక్క‌డికే తీసుకొచ్చి పూజ‌లు నిర్వ‌హిస్తారు. 

సైనికుల‌కు, హిమాల‌య యాత్ర‌కు వెళ్లిన ప‌ర్యాట‌కుల‌కు ఇదే బేస్ క్యాంప్‌. 

బ‌ద్రీనాథ్ సంద‌ర్శ‌న‌కు వెళ్లే భ‌క్తుల్లో చాలామంది రాత్రి ఇక్క‌డే బ‌స చేస్తారు. 

భార‌త సైనిక ద‌ళాల‌కు ఇదో వ్యూహాత్మ‌క ప‌ట్ట‌ణం. 

ధౌలిగంగా, అలకానంద న‌దుల సంగ‌మ స్థాన‌మైన విష్ణుప్ర‌యాగ‌కు చేరువ‌లో ఉంటుంది. 

ఆది శంక‌రాచార్యులు నెల‌కొల్పిన నాలుగు పీఠాల్లో జోషీమ‌ట్ ఒక‌టి. 

ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్క‌డే ఉంది.