మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? కొరివితో తల గోక్కున్నట్టే 

ప్రమాదకర యాప్‌ను గుర్తించి, ప్లే స్టోర్ నుంచి తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్.

ఇది ఒక రికార్డింగ్ యాప్.

దీని పేరు ఐరికార్డర్-స్క్రీన్ రికార్డర్ (iRecorder-Screen Recorder).

దీన్ని ఒకసారి డౌన్‌లోడ్ చేసుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే.

ప్రతి 15నిమిషాలకు ఓసారి ఆడియో రికార్డింగ్ చేసి తన డెవలపర్‌కు పంపిస్తున్న యాప్.

2021 సెప్టెంబర్‌లో వచ్చిన యాప్.

ఇప్పటివరకు 50వేల మందికిపైగా ఇన్‌స్టాల్ చేసుకున్నారు.

ప్రారంభంలో ఇది ప్రమాదకరంగా లేదు.

2022 ఆగస్టులో ఈ యాప్ 13.8 వెర్షన్‌లో డెవలపర్ ప్రమాదకర కోడ్‌ను పొందుపరిచినట్లు గుర్తింపు.

ఫోన్‌లో ఉన్న కాల్ లాగ్స్, కాంటాక్ట్స్‌లోకి చొరబడుతుంది.

టెక్ట్స్ మెసేజులు, ఫైల్స్ లిస్ట్, డివైస్ లొకేషన్, SMSలు పంపడం, ఆడియో రికార్డింగ్, ఫొటోలు తీయడం వంటివి చేస్తుంది. 

మొబైల్‌లోని మైక్రోఫోన్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుని ఆడియో రికార్డ్ చేస్తుంది.

ఫోన్‌లోని ప్రత్యేకమైన ఫైళ్లను కూడా తస్కరిస్తుంది.