శివభక్తులు ఒక్కసారైనా  ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి అనుకుంటారు. అన్నీకాకపోయినా వాళ్లు          ఉన్న రాష్ట్రంలోని             జ్యోతిర్లింగాన్నైనా            దర్శించి తరిస్తారు.        శివుడి ద్వాదశ           జ్యోతిర్లింగాల గురించి   తెలుసుకుందాము

సోమ‌నాధ జోతిర్లింగం- గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది.

శ్రీ‌శైలం మ‌ల్లికార్జున స్వామి-ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాసారని ప్రతీతి

మ‌హాకాళేశ్వ‌ర్ జోతిర్లింగం-  మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఉజ్జయినీలో క్షిప్ర నది ఒడ్డున  ఆలయం ఉంది. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగంగా ప్రసిధ్ధి

ఓంకారేశ్వర్ జోతిర్లింగం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం  ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్య‌క్షేత్రం ఉంది. ఇక్కడ  ఓ లింగము రెండు భాగములుగా ఉండి,  రెండు పేర్లతో పూజింపబడుతున్నది 

వైద్యనాథ్ జోతిర్లింగం బీహార్ లోని పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లింగాన్ని పూజించిన  వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి

శ్రీనాగనాథేశ్వర జోతిర్లింగం- మహారాష్ట్రలోని ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జోతిర్గింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు

రామేశ్వ‌ర జ్యోతిర్లింగం- తమిళనాడు లోని రామేశ్వరంలో ఉంది. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిధ్ది

కేదార్నాథ్ జోతిర్లింగం-ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. ఈ ఆలయాన్ని సంవత్సరంలో 6నెలలు మాత్రమే తెరుస్తారు. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి

త్రయంబ‌కేశ్వర్ జోతిర్లింగం- మహారాష్ట్రలోని నాసిక్‌కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. ఇక్కడి శివలింగము చిన్న గుంటవలె కనిపించును, అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగములున్నవి

భీమశంకర్ జోతిర్లింగం- మహారాష్ట్రలో పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమ నది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత

ఘృష్ణేశ్వర జోతిర్లింగం- మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో అజంతా  ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది.  దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని  ఆలయం వెలిసింది

విశ్వనాథ జోతిర్లింగం-ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాశిలో శ్రీవిశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం. వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందింది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. ఈ క్షేత్రంలో స్నాన, జప, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి