టీ20 వరల్డ్‌కప్-2022 ఆస్ట్రేలియాలో జరుగుతుంది. 

అక్టోబర్ 16న టోర్నీ ప్రారంభమైంది. 

21వ తేదీ వరకు టోర్నీలో సూపర్-12 అర్హతకోసం ఎనిమిది జట్లు పోటీ పడ్డాయి.

ఎనిమిది జట్లలో నాలుగు జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి.

మెగా టోర్నీలో టీమిండియా 23న తొలి మ్యాచ్ ఆడుతుంది.

23న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. 

27న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా-నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది.

30న పెర్త్ స్టేడియంలో ఇండియా - సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. సాయంత్రం 4:30 గంటలకు ప్రాంరభమవుతుంది.

నవంబర్ 2న అడిలైడ్ ఓవల్ స్టేడియంలో ఇండియా - బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.

నవంబర్ 6న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇండియా - జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.

9న సెమీ ఫైనల్ -1 అదేవిధంగా 10న సెమీపైనల్ -2కు చేరిన జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి.

నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.