అది 150 ఏళ్ల చరిత్ర ఉన్న గురుద్వారా..పేరు ‘షహీద్ బాబా నిహాల్ సింగ్’..

పంజాబ్‌లోని జలంధర్‌కి 12 కిలోమీటర్ల దూరంలో తాల్హాన్ గ్రామం ఉంది.

‘షహీద్ బాబా నిహాల్ సింగ్’ గురుద్వారాలో విమానాలను బహుమతులుగా ఇస్తారు..

ఎందుకంటే మన చిలుకూరు బాలాజీ టెంపుల్ లా ఈ గురుద్వారాకు వస్తే వీసాలు వెంటనే వచ్చేస్తాయట..

ఏదేశానికైనా వెళ్లాలనుకునేవారికి వీసా రావాలంటే భక్తులు.. బొమ్మ విమానాలను ఈ గురుద్వారాలో ఇస్తే వెంటనే వీసా వచ్చేస్తుందట..

అందువల్ల ఈ గురుద్వారాను విమానం గురుద్వారా అని పిలుస్తారు. అందుకే ఈ గురుద్వారాపై భారీ బొమ్మ విమానం ఉంటుంది.

ఎంత ప్రయత్నించినా వీసా, పాస్‌పోర్ట్ రానివారు.. ఇక్కడికి వచ్చి విమాన బొమ్మ సమర్పిస్తే వీసా వచ్చేస్తుందట.

2006లో స్థానిక జాట్లు, దళితుల మధ్య ఈ గురుద్వారాపై ఆధిపత్యం కోసం పోరాటం జరిగింది.

అటువంటి పరిస్థితుల్లో ఈ గురుద్వారాని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిర్వహణ చూస్తోంది..