వైద్య చికిత్సతో పాటు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పులు తోడైతేనే మధుమేహం అదుపులో ఉంటుంది.
ఆహారంలో చిరుధన్యాలు.. కొర్రలు, అరికలు, సామలు, ఉధలు, ఆండ్రకొర్రలు మొదలైన ముడి ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.
అన్నిరకాలైన కూరగాయలు, ఆకు కూరలు, మొలకెత్తిన గింజలు ఎక్కువగా తీసుకోవాలి.
భోజనంలో అన్నము, రొట్టెల కన్నా ఉడికించిన కూరగాయలు ఎక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి.
పండ్లలో ఆపిల్, దానిమ్మ, జామ, నారింజ, బత్తాయి మరియు బొప్పాయి పండ్లు తీసుకొనవచ్చు.
చక్కర శాతం అధికంగా ఉండే పండ్లలో మామిడి, అరటి, ద్రాక్ష, సపోటా, సీతాఫలాలకు దూరంగా ఉండాలి.
లివర్, కిడ్నీ, స్ప్లీన్, బ్రేన్, గుడ్దులోని పచ్చ సొన, రొయ్యలు, పీతలు లాంటి మాంసాలు తీసుకోకపోవడం ఉత్తమం.
అధికంగా ఉప్పుకలిగిన పదార్థాలు ఉరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు, వడియాలు, పొడులు, నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకొనరాదు.
ఒకసారి మరిగించిన నునెలను మళ్లీ వంటలలో వాడరాదు.
రోజుకి కనీసం 2 నుండి 3 లీటర్లు నీరు త్రాగాలి.
క్రమం తప్పకుండా 45 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి.
ధూమపానం, అల్కహల్ పూర్తిగా మానివేయాలి.