ప్రపంచం ఇంత అడ్వాన్స్‌గా ముందుకెళ్తున్నా.. క్యాన్సర్ మహమ్మారి మాత్రం ఇంకా మనల్ని పీడిస్తూనే ఉంది

క్యాన్సర్‌లో ఎన్నో రకాలు ఉండగా మన సెలబ్రిటీలు సైతం కొందరు క్యాన్సర్ బాధితులే

మనీషా కోయిరాలా 2012లోక్యాన్సర్ సోకినట్లు ప్రకటించింది.. చికిత్సతో క్యాన్సర్‌ జయించి మళ్ళీ నటిస్తుంది

ఉత్తర దక్షిణాదిలో అలరించిన సోనాలి బింద్రే క్యాన్సర్ సోకి న్యూయార్క్‌లో చికిత్స తీసుకుని యుద్ధమే చేసి గెలిచింది

ట‌క్కరి దొంగ హీరోయిన్ లీసారే క్యాన్స‌ర్ బారిన ప‌డి ప్రాణాల‌తో పోరాడి గెలిచి మ‌ళ్లీ మామూలు మ‌నిషి అయింది

గౌతమి కొన్నేళ్ల పాటు క్యాన్స‌ర్‌తో పోరాడి ప్రాణాలను దక్కించుకుంది. ఇప్పుడు అవగాహనా కార్యక్రమాలు చేపడుతుంది

మ‌మ‌తా మోహ‌న్ దాస్ కూడా కొన్నేళ్లు క్యాన్స‌ర్‌తో పోరాడి గెలిచి ఇపుడు మళ్లీ నటిగా సత్తా చాటుతోంది

తాజాగా హంసా నందికి బ్రెస్ట్ క్యాన్సర్ సోకగా ప్రస్తుతం ఆమె నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలలో ఈ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్‌ వెటరన్‌ యాక్టర్ రిషి కపూర్‌,  ఇర్ఫాన్‌ ఖాన్‌,  ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా,  హృతిక్ రోషన్‌ తండ్రి రాకేష్ రోషన్‌,  వినోద్ ఖన్నా,  సూపర్‌స్టార్ రాజేష్ ఖన్నా, హీరో సంజయ్‌ దత్‌  క్యాన్సర్ సోకినవాళ్ళే