హఠాత్తుగా ట్విటర్‌లో G.O.A.T. అనే ఈ ఎమోజీ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది

మీమ్స్ నుండి కామెంట్స్ వరకు ఎక్కడ చూసినా G.O.A.T. కనిపిస్తుంది

పెద్ద పెద్ద సెలబ్రిటీల నుండి సినీ హీరోలను కూడా ఈ పదంతో కామెంట్ చేస్తున్నారు

నిత్యం సోషల్ మీడియాలో ఉండేవారికి కూడా కొందరికి ఈ పదానికి అర్థం తెలియదు

అసలు ఈ పదం ఎందుకు ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందో కూడా ఒక్కోసారి అర్థం కాదు

అయితే.. ఇది నిజంగా గొప్ప పదమే కాదు.. గొప్పవాళ్ళని చెప్పడమే దీని అర్థం

G.O.A.T. అంటే 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' అని అర్థం

ఒకరిని పొగడడానికి, వారి టాలెంట్ ని తెలపడానికి ఈ పదాన్ని వాడుతారు

సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యాక ఈ పదం బాగా పాపులర్ అయింది

అయితే మొట్టమొదటిసారి ఈ పదాన్ని బాక్సింగ్ లెజెండ్ మొహమద్ అలీ భార్య లోన్ని అలీ 1992లో ఉపయోగించారు

కొందరు దీన్ని నచ్చని సెలబ్రిటీలను ట్రోల్ చేసేందుకు జంతువుగా ఉపయోగిస్తున్నారు