చాలా మందికి తిన్న ఆహారం సరిగా జీర్ణంకాదు.
అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలే ప్రధాన కారణమని నిపుణులు చెపుతున్నారు.
సమయానికి భోజనం చేయకపోవటం, మద్యపానం, ధూమపానం, బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కూడా అజీర్ణ సమస్య తలెత్తుతుంది.
తినే ఆహారాలను బట్టి అవి జీర్ణం అయ్యే సమయం మారుతుంది.
శాకాహారం అయితే త్వరగా.. మాంసాహారం అయితే ఆలస్యంగా
భోజనం చేసిన గంట తరువాత యాపిల్ తింటే అంతకుముందు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
నారింజ, జామ, దానిమ్మ పండ్లు సైతం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
భోజనానికి ముందు పుదీనా రసం తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడే బాక్టీరియా పెరుగులో ఉంటుంది.
ఆహారంలో జీలకర్ర వాడటం వల్ల వంట రుచి మారిపోవడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అజీర్ణం, అజీర్తి మలబద్ధకం వంటి సమస్యల పరిష్కారానికి బొప్పాయి బాగా తోడ్పడుతుంది.