రాత్రి సమయాల్లో ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఉండేవారిలో బరువు పెరిగే సమస్య అధికంగా ఉంటుంది.

రాత్రి తినే అధిక కేలరీల ఆహార పదార్థాల వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

రాత్రి వరకూ ఉండే సుదీర్ఘమైన వ్యవధి మూలంగా ఆకలి పెరిగి, అవసరానికి మించి, కొంత ఎక్కువగా తినేందుకు అవకాశం ఉంటుంది.

రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవటం మంచిది.

నిద్రకు ముందు ఆహారం తినడం వల్ల అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఒత్తిడి, ఆందోళనలు సైతం తినే ఆహారంపై అధిక ప్రభావాన్ని చూపిస్తాయి.

పరిమితికి మించి ఆహారం శరీర బరువుకు కారణమౌతుంది.

వీలైనంత వరకు నిద్రకు రెండు గంటల ముందే ఆహారం తీసుకోవటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా ఉంటాయి.

తిన్నతరువాత నేరుగా బెడ్ పైకి చేరకుండా కొంత సేపు తేలిక పాటి వాకింగ్ వంటి వ్యాయామాలు చేయటం మంచిది.

రాత్రి సమయంలో తీపి ఎక్కువగా ఉండే స్వీట్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిని తినకూడదు.