తోలు సేకరణ పేరుతో.. జరుగుతున్న జంతు హింసను చూసి కదిలిపోయి.. ప్రత్యామ్నాయాన్ని వెదికారు దిశాసింగ్‌.

ఆ ఆలోచన నుంచి ప్రాణం పోసుకున్నదే ‘జౌకా’ అనే వేగన్‌ లెదర్‌ యాక్సెసరీ సంస్థ..

బ్యాగుల తయారీలో పైనాపిల్‌ ఆకులు, ఆపిల్‌ చెక్కు, పండ్ల వ్యర్థాలు వినియోగిస్తారు.

అలాగే రకరకాల వృక్ష సంబంధ పదార్థాలతో చేసిన కృత్రిమ తోలును ఉపయోగిస్తారు.

కొన్ని సందర్భాలలో..  రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌,లీయురేథెన్‌ వాడతారు.

ఇవి అచ్చమైన  లెదర్‌ ఉత్పత్తుల్లానే  ఉంటాయి.

బ్యాగుల మీద ఉండే ప్రింట్లు, పువ్వులు, మోటిఫ్‌లు, డిజైన్లు..  అన్నీ భారతీయతను ప్రతిబింబిస్తాయి.

అవసరమైన చోట  డిజైన్ కోసం ఇక్కత్‌,  జూట్‌, ఖాదీ వస్త్రాలనే ఎంచుకుంటారు.

ఈ డిజైన్లు అన్నీ దిశాసింగ్‌  వినూత్న ఆలోచనలకు ప్రతిబింబాలు..