విరుమన్‌ సినిమా హిట్ అవ్వడంతో.. హీరో కార్తీ, నిర్మాత సూర్య, డైరెక్టర్ కి ఖరీదైన గిఫ్టులిచ్చిన డిస్ట్రిబ్యూటర్

కార్తీ హీరోగా, అదితిశంకర్ హీరోయిన్ గా తెరకెక్కిన విరుమన్‌ సినిమా ఆగస్టు 12న రిలీజ్ అయి తమిళనాడులో మంచి విజయం సాధించింది.

విరుమన్‌ సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై హీరో సూర్య నిర్మించాడు.  ఈ సినిమాని తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్‌ శక్తివేలన్‌ రిలీజ్ చేయగా సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్లు వచ్చాయి.  దీంతో డిస్ట్రిబ్యూటర్స్ స్పెషల్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు.

విరుమన్‌ సక్సెస్ మీట్ లో సినిమా హిట్‌ అయి డబ్బులు బాగా వచ్చినందుకు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్‌ శక్తివేలన్‌ ఈ సినిమా హీరో కార్తీకి, నిర్మాత సూర్యకి, సహా నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌కు డైమండ్‌ బ్రాస్‌లేట్స్‌ గిఫ్ట్ గా ఇచ్చాడు.  తానే స్వయంగా వారి చేతులకి వీటిని తొడిగాడు.

అలాగే సినిమా దర్శకుడు ముత్తయ్యకు డైమండ్ రింగ్ ని కానుకగా ఇచ్చాడు.

ఎప్పుడూ హీరోలు, నిర్మాతలు గిఫ్టులివ్వడం చూసి, తాజాగా డిస్ట్రిబ్యూటర్ హీరోకి, నిర్మాతకి, డైరెక్టర్ కి  గిఫ్ట్స్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.