సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. ప్రిన్స్ ముఖ్య పాత్రలో నటించారు.

విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

శనివారం ఫిబ్రవరి 12న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది.

‘డిజే టిల్లు’ టైటిల్ సాంగ్ అంతటా మోగిపోతుంది. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది.

అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి.

మొదటి రోజు వరల్డ్ వైడ్ మొత్తం 4 కోట్ల షేర్ కలెక్షన్స్ ని సాధించింది.

సినిమాకి పెట్టిన బడ్జెట్ వచ్చేయటంతో ప్రస్తుతం ఫుల్ లాభాల్లో నడుస్తుంది 'డీజే టిల్లు'