అచ్చొచ్చిన మైదానంలో నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి విజృంభించాడు.

మెల్‌బోర్న్‌లో పదోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్ త‌న ఖాతాలో వేసుకున్నాడు.

జొకోవిచ్ త‌న కెరీర్‌లో మొత్తం 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ చేజిక్కించుకున్నాడు.

అత్యధిక టైటిల్స్ జాబితాలో రఫేల్‌ నాదల్‌తో కలిసి అగ్రస్థానానికి చేరాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ - 10, ఫ్రెంచ్‌ ఓపెన్ - 2, వింబుల్డన్ - 7, యూఎస్‌ ఓపెన్ - మూడు సార్లు గెలుచుకున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023 సంవ‌త్స‌రాల్లో) గెలుచుకున్నాడు. 

ఫ్రెంచ్‌ ఓపెన్ టైటిల్స్  (2016, 2021 సంవ‌త్స‌రాల్లో ) గెలుచుకున్నాడు. 

వింబుల్డన్ టైటిల్స్ (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022 సంవ‌త్స‌రాల్లో ) గెలుచుకున్నాడు. 

యూఎస్‌ ఓపెన్ టైటిల్స్  (2011, 2015, 2018 సంవ‌త్స‌రాల్లో) గెలుచుకున్నాడు. 

మరో రెండుమూడేండ్లు ప్రొఫెషనల్‌ కెరీర్‌ కొనసాగిస్తే జొకోవిచ్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదగడం ఖాయమే.