వ్యాయామం అనగానే కొందరికి ఒంటి నొప్పులు గుర్తొస్తాయి

వ్యాయామానికి ముందు, తర్వాత నిర్దిష్ట ఆహార నియమాలు పాటించాలి.

ఆహార నియమాలు పాటిస్తే ఒంటి నొప్పులు వేధించవు.

సమర్ధమైన వ్యాయామం కోసం తగినంత శక్తి అవసరం.

వ్యాయామానికి ముందు శక్తిని అందించే పిండిపదార్థాలు తీసుకోవాలి.

- యాపిల్‌, మొక్కజొన్న, బ్రౌన్‌ బ్రెడ్‌ విత్‌ పీనట్‌ బటర్‌ లాంటివి తినాలి. 

వ్యాయామం చేస్తున్నప్పుడు అలసటకు లోనవకుండా ఉడకబెట్టిన గుడ్డు, అరటిపళ్లు తినవచ్చు.

వ్యాయామం తర్వాత కచ్చితంగా మాంసకృత్తులు తీసుకోవాలి. 

గుడ్డు తెల్లసొన, ఆవిరి మీద ఉడికించిన చికెన్‌, చేప తినవచ్చు. 

ప్రొటీన్‌ షేక్‌ అలవాటు ఉన్నవాళ్లు వ్యాయామం పూర్తయిన వెంటనే ప్రొటీన్‌ షేక్‌ ఒకటి తీసుకుంటే సరిపోతుంది.