మెడ నొప్పి అనేది చాలా సాధారణమైన మస్క్యులో స్కెలెటర్ డిజార్డర్.
ఇది ప్రతి ముగ్గురిలో ఒకరిని కనీసం సంవత్సరానికి ఒకసారి ప్రభావితం చేస్తుంది.
నొప్పి తీవ్రంగా ఉంటే భుజాలు, చేతులు నొప్పి, తలనొప్పి కూడా రావొచ్చు.
మెడ నొప్పిని కొన్ని రకాల చిట్కాలతో నివారించవచ్చు.
కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు నిటారుగా కూర్చోవాలి
రోజూ 10 నుంచి 15 నిమిషాలు మెడ వ్యాయామాలు చేయాలి.
కంప్యూటర్, ఫోన్ ను ఉపయోగిస్తున్నప్పుడు వంగి కూర్చోవద్దు.
బరువైన వస్తువులను ఎత్తడం మానుకోండి. అది మీ మెడకు ఇబ్బంది కలిగించవచ్చు.
కారులో ప్రయాణించే సమయంలో సీటు బెల్ట్ ని ఉపయోగించండి. రోడ్డు ప్రమాద సమయంలోనూ రక్షణ ఇస్తుంది.
మీరు నిరంతరం మెడ నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.