జీవితంలో అన్ని సందర్భాలలోనూ మనం అందరికీ నచ్చకపోవచ్చు. ప్రేమ విఫలం కావడం, ఇంటర్వ్యూలో సెలక్ట్ కాకపోవడం, బంధాలు దూరం కావడం, నచ్చిన వారు దూరం పెట్టడం ఇలా అనేకం జరుగుతూనే ఉంటాయి. మరి దీని నుంచి బయట పడాలంటే ఈ విధంగా చేయండి..

ఎంత బాధ అయినా అనుభవించండి. దానికి వేరే దారులు వెతక్కండి.

ఉద్యోగం రాలేదని కూడా ఎక్కువ ఆందోళన చెందక,. మరో దారిలో ఉద్యోగం పొందేలా ఆలోచించండి.

ఇష్టపడిన వారు తిరస్కరించినా కూడా మనసును గట్టి చేసుకోవాలి.

బాధగా, నిరాశగా, ఆందోళనగా ఉన్నప్పుడు స్నేహితులను కలవండి.

ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ లేకపోతే, సరిగ్గా అవగాహన లేకపోయినా ఇద్దరి మధ్యా బంధం సరిగా ఉండకపోవచ్చు. దానికి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. 

నేను అందంగా లేను అనే భావనను వదిలేయండి. అనుభవిస్తున్న బాధలోంచి చివరికి ఏం అనుభవం అయింది అది తెలుసుకోండి. 

ఈ తిరస్కారం నుంచి నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటి? ఈ తిరస్కారం తరువాత నేను భిన్నంగా ఏమి చేయగలను? అనే ప్రశ్నవేసుకోండి.