పక్షవాతం వస్తే  ఎలాంటి మనిషైనా కుప్పకూలిపోవాల్సిందే.

పక్షవాతం బారిన పడిన తర్వాత శరీరంలో సగభాగం చచ్చుబడి పోతుంది. 

పక్షవాతం వస్తే సకాలంలో ఎలా స్పందించాలో తెలుసుకుందాం.

తొలిగంటలో స్పందిస్తే శరీరంలోని అవయవాలను కాపాడుకోవచ్చు.

బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని తెలిసినప్పుడు మాట తడబడుతుంది.

కాలు, చేయి ఆడదు. చూపు మందగిస్తుంది. తలనొప్పి, వాంతులు కూడా అవుతాయి.

పక్షవాతం వచ్చిందని తెలియగానే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.

తొలి గంటలో వైద్యులకు చూపించగలిగితే పక్షవాతం నుంచి రక్షించుకోవడానికి సాధ్యం అవుతుంది.

పక్షవాతం లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగానే ఎమర్జెన్సీగా ఎంఆర్‌ఐ గానీ, సీటీస్కాన్‌ గానీ చేస్తారు.

ఇందులో ఎలాంటి స్ట్రోక్ వచ్చిందో తెలుసుకొని చికిత్స ప్రారంభిస్తారు.

అత్యవసరంగా ఆపరేషన్‌ చేసి రోగిని కాపాడడానికి అవకాశం ఉంటుంది.