బోసినవ్వుల బుజ్జాయికి కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది.

పాపాయికి పక్క మెత్తగానే కాదు, సౌకర్యవంతంగానూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

మూడు నాలుగు నెలల వరకు పక్కపైనే ఎక్కువ సేపు చిన్నారులు నిద్రలో గడుపుతుంటారు. అటువంటప్పుడు దానికి మరింత ప్రాముఖ్యతనివ్వాలి

పరుపు అనారోగ్యాన్ని కలిగించేలా ఉండకూడదు. లేదంటే ఆ చిన్నారి నిద్రలేమితో తల్లికీ అనారోగ్యాలే. 

Fill in some text

కొబ్బరి పీచుతో తయారయ్యే పరుపు వేడిని గ్రహిస్తుంది. 

 పరుపు వాటర్ ప్రూఫ్ గా ఉండాలి. నీటిని పీల్చకుండా ఉంటేనే తడి, చెమ్మ లోపలికి చేరవు.

పరుపు తడిని పీల్చుకుంటే దాంట్లోంచి ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియాలు అనారోగ్యాలకు కారణమవుతాయి. వాటర్ ప్రూఫ్ ని శుభ్రం చేయడం కూడా తేలిక.

మెత్తని బూరుగుదూది వంటివాటితో తయారయ్యే పరుపు పాపాయికి ఎక్కువ సమయం వేడి ఉత్పత్తి అవకుండా చేసి కావాల్సిన మెత్తదనాన్ని అందిస్తుంది.