పులిపిర్లు చాలా మందిలో కనిపించే సాధారణ సమస్య.
ఇవి రావడానికి చాలా కారణాలుంటాయి.
అధిక బరువు కూడా ఇవి రావడానికి క
ారణమవుతుంది.
కొందరిలో ఎలాంటి సమస్య లేకపోయినా పులిపిర్లు కనిపిస్తాయి.
ఇవి చూడటానికి మాత్రమే ఇబ్బందికరంగా ఉంటాయి.
వీటిని తొలగించుకోకపోవడం వల్ల పెద్దవి కావడం, కేన్సర్‌గా మారడం అంటూ జరగదు.
పులిపిర్లను తొలగించుకోకపోతే కొత్తవి వస్తాయనడంలో నిజం లేదు.
తీయించుకున్నా, తీయించుకోకపోయినా శరీరతత్త్వాన్ని బట్టి కొత్తవ
ి వస్తూనే ఉంటాయి.
పులిపిరిని తొలగించిన ప్రదేశంలో మళ్లీ కొత్తగా రావు.
పులిపిర్లు పోవడానికి టాబ్లెట్లు, క్రీములు ఏమీ లేవు
.
డెర్మటాలజిస్టును సంప్రదిస్తే పులిపిర్లను ఎలాంటి నొప
్పి లేకుండా తొలగిస్తారు.
కంటి రెప్పపైన ఉన్నా నొప్పి లేకుండా తీయడం సాధ్యమవుతుంది.