ఉదయం నిద్రలేస్తూనే తలనొప్పిగా ఉంటుందా?

కొంతమందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే తరచుగా తలనొప్పి వస్తూ ఉంటుంది. 

పేలవమైన రాత్రి నిద్ర , ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు ఈ తలనొప్పిని వస్తుంది. 

దీనిని సాధారణమైనదిగా భావించి నెగ్లెట్ చేయడం సరైన పద్ధతి కాదు.. అప్రమత్తంగా ఉండాలి.

మైగ్రేన్ వల్ల తరచుగా ఉదయాన్నే తలనొప్పి వస్తుంది. 

విపరీతమైన ఒత్తిడి, శరీరంలో నీరు లేకపోవడం, నిద్రలేమి వంటి సమస్యల వల్ల తలనొప్పి వస్తుంది. 

శరీరంలో రక్తం లేకపోవడం కూడా కారణం కావొచ్చు.

శరీరంలో ఆక్సిజన్ తగినంత లేకపోయినా మైకం కూడా వస్తుంది. 

రాత్రి సమయంలో వర్క్ చేసే వారికి ఉదయాన్నే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి.

గ్లాస్ చల్లటి నీటిలో నిమ్మ రసాన్ని కలిపి తాగటం మంచిది. 

కచ్చితంగా 8 గంటల సమయం నిద్రకు కేటాయించటం ద్వారా తలనొప్పుల బారిన పడకుండా ఉండవచ్చు. 

అలాగే రోజువారిగా వ్యాయామాలు, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండాలి. 

సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల వద్ద చికిత్స పొందటం మంచిది.