భోజనం చేశాక నడకతో ఎన్ని లాభాలో తెలుసా

చాలా మంది భోజనం చేసిన వెంటనే కూర్చుంటారు. రాత్రివేళ అయితే వెంటనే మంచం ఎక్కేస్తారు. 

భోజనం తర్వాత 15నిమిషాల పాటు నడవడం వల్ల అనేక లాభాలున్నాయని పరిశోధనల్లో వెల్లడి.

మనం తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. 

అందుకే భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడిస్తే శరీరంలో విడుదలయ్యే ఇన్సులిన్.. 

బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులను సమన్వయం చేస్తుంది.

భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో పెప్సిన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది. 

ఇది ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్యం బాగుంటుంది. 

అలాగే చక్కగా నిద్ర పడుతుంది.

భోజనం తర్వాత నడక జీర్ణక్రియను పెంచి కొవ్వుని కరిగిస్తుంది. 

అలాగే గుండె జబ్బులను రాకుండా చేస్తుంది.

భోజనం తర్వాత కనీసం 10 నిమిషాలపాటైనా నడిస్తే బీపీ అదుపులో ఉంటుంది.