పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు తిన‌‌గ‌లిగే ఆహారంలో బాదం ప‌ప్పు కూడా ఒక‌టి.

సూపర్‌ ఫుడ్‌గా పిల‌వ‌బ‌డే బాదంలో న్యూట్రీషియన్స్ , విటమిన్స్ , ఫైబర్, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్, ప్రోటీన్స్ అత్యధికంగా ఉన్నాయి.

బాదంను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బాదం ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ స్థాయి అదుపులో  ఉంటుంది.ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి.త‌ద్వారా  మధుమేహం అదుపులో ఉంటుంది

నానబెట్టిన బాదం తినొచ్చా.? అన్న‌ది చాలా మందిలో ఉండే సందేహం.

Title 2

నానబెట్టిన బాదాం పప్పులు తినడమే ఆరోగ్యానికి మంచిది.

బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది.అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా చేస్తుంది.

ఎప్పుడైతే బాదం పప్పులని నానబెట్టామో, అప్పుడు ఆ తొక్క ఊడిపోతుంది.

ముఖ్యంగా రాత్రి పూట నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

క్ర‌మం తప్ప‌కుండా బాదంను తిన‌డం వ‌ల్ల‌ జ్ఞాపకశక్తి మెరుగుప‌డుతుంది.ఇక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి బాదం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.