ఏడ్చేవారిని ఏడవనివ్వండి..

ఏడవటం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..!

నవ్వడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. 

అందుకే చాలామంది లాఫింగ్ ఎక్సర్ సైజ్ కూడా చేస్తారు. 

అయితే ఎప్పుడూ నవ్వడమే కాదు అప్పుడప్పుడు ఏడవటం కూడా ఆరోగ్యానికి మంచిదట. 

ఏడ్చినప్పుడు కన్నీళ్లు రావడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. 

బాధలో ఉన్నప్పుడు ఏడవటం వల్ల భాగోద్వేగాలను సమతుల్యం చేస్తాయి. 

మనసు ప్రశాంతం అవుతుంది.

ఒత్తిడిలో ఏడవటం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. 

ఇవి శారీరకంగా, మానసికంగా ప్రశాంతతను కలగజేస్తాయి. 

ఏడవటం వల్ల కళ్లు శుభ్రమవుతాయి. 

కళ్లలో ఉండే ఐసోజిమ్ అనే ఏంజైమ్లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కళ్లలోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి.

కళ్లకు ఏదైనా దెబ్బతగిలినప్పుడు లేదా ఉల్లిగడ్డలు కోసినప్పుడు వచ్చే కన్నీళ్లు కళ్ల మంటను తగ్గిస్తాయి.