కండరాల నొప్పికి కారణాలు

వ్యాయామం చేసేటప్పుడు, కండరాలపై ఒత్తిడి పడినప్పుడు, 

తప్పు భంగిమలో నిద్రపోయినప్పుడు, ఎక్కువ టైం ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు

కండరాలు జారడం లేదా బెణకడం వల్ల నొప్పులు మొదలవుతాయి.

రాత్రిపూట నిద్రపోతున్న సమయంలో,

మెలకువలో కూడా ఉన్నట్టుండి తొడలు, కాలిపిక్కలు పట్టేయడం జరుగుతుంది.

వీటికి తోడు విటమిన్ డి, థైరాయిడ్, శరీరంలో లవణాలు లేకపోవడం,

స్టెరాయిడ్స్ తీసుకోవడం లాంటివి కూడా కండరాల నొప్పికి దారితీస్తాయి. 

కండరాలు పట్టేయడానికి కారణం రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం

థైరాయిడ్ సమస్య వంటివి కారణమౌతాయి.

సరిగా నిద్ర లేకపోయినా, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్,

కండరాల మీద ఒత్తిడి పెరిగి ఇలా జరుగుతుంది. 

శరీరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం తగ్గటం వల్ల కూడా ఇలా జరుగుతుంది.