పెద్ద ముక్కు ఉన్న పక్షుల్ని చూశాం..చిట్టిముక్కు ఉన్న పక్షుల్ని చూశాం..కానీ ‘మీసాలు’ఉన్న పక్షి కూడా ఉందండోయ్..దాని పేరేమిటో..దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందామా..?

మీసాలు ఉన్న పక్షి పేరు ica tern...ఈ జాతి పక్షులు ఎక్కువగా పెరూ.. చిలీలో కనిపిస్తాయి..

టెర్న్ పక్షుల్లో 11 రకాల జాతులున్నాయి..వీటిల్లో కొన్ని జాతులు ఒకే గుడ్డు పెడతాయి.

బూడిద రంగులో ఉండే ఓ జాతికి చెందిన టెర్న్ పక్షికి రెండు వైపులా తెల్లటి ‘మీసాలు’ ఉంటాయి.

దీని ముక్కు, పాదాలు నారింజ రంగులో ఉంటాయి.

40 సెం.మీ పొడవున్న ఈపక్షి రాళ్లు ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంది.

40 సెం.మీ పొడవున్న ఈపక్షి రాళ్లు ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తుంది.

టెర్న్ ఒకేసారి ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది. పక్షి గుడ్డు నుంచి బయటకు రావడానికి 4 వారాలు పడుతుంది.

గుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లలు 7 నుంచి 8 వారాలలో గూడును విడిచిపెట్టి స్వతంత్రంగా జీవిస్తాయి.

టెర్న్ పక్షుల సంఖ్య తగ్గిపోతోందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.