ట్రాక్‌పై ఒకే రైలు ఒకే దిశలో నడుస్తున్నా డ్రైవర్లు హారన్ మోగిస్తారు

ఇలా రైలు డ్రైవర్లు హారన్ మోగించడం వెనుక చాలాపెద్ద రీజన్స్ ఉంటాయి

డ్రైవర్ చిన్న హారన్ కొడితే వెనుక ఇంజిన్ నుండి సహాయం అవసరం లేదని అర్థం

డ్రైవర్ చిన్నగా రెండు హారన్లు కొడితే గార్డు నుండి సిగ్నల్ అడుగుతున్నాడ‌ని అర్థం

మొదట చిన్నగా, తర్వాత గ‌ట్టిగా హార‌న్‌ కొడితే వెనుక ఇంజిన్ నుండి సహాయం కావాల‌ని అర్థం

మొదట పెద్ద‌గా, త‌రువాత‌ చిన్నగా హార‌న్‌ కొడితే బ్రేక్‌ విడుదల చేయమని గార్డుకు సూచన

మూడు చిన్న హార‌న్లు కొడితే రైలు అదుపు తప్పిందని, గార్డును ఎమర్జెన్సీ బ్రేక్ వేయమని సిగ్నల్

నాలుగు చిన్న హార‌న్లు కొడితే ముందు మార్గం లేదని స్టేషన్ తో మాట్లాడమని గార్డుకు సూచన

మొదట రెండు పెద్ద హార‌న్లు, తరువాత రెండు చిన్న హార‌న్లు కొడితే గార్డును పిలుస్తున్నాడని

ఒకసారి చిన్నగా, కొద్దిసేపు తర్వాత మళ్ళీ చిన్న హార‌న్‌ కొడితే గార్డు నుండి టోకెన్ డిమాండ్

సుదీర్ఘమైన నిరంతర హార‌న్‌ కొడితే రైలు సొరంగం గుండా వెళుతుందని అర్థం

చిన్న స్టేషన్‌లో ఆగాల్సిన అవసరం లేదని తెలిపేందుకు సుదీర్ఘ హారన్ కొడతారు

మొదట‌ రెండు చిన్న హార‌న్లు.. తర్వాత ఒక పెద్ద హార‌న్‌ కొడితే చైన్ లాగినట్లు

నిరంతరంగా చిన్న హార‌న్‌ కొడుతుంటే అతనికి మార్గం కనిపించడం లేదని అర్ధం