పాలిచ్చే తల్లులు కూడా ఆహారాన్ని తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తల్లి తీసుకునే ఆహారంపైనే శిశువు యొక్క ఆరోగ్యం అధారపడి ఉంటుంది.

కనీసం బిడ్డ పుట్టిన ఆరుమాసాలపాటు పోషకవిలువలున్న ఆహారాలను రోజు తప్పనిసరిగా తీసుకోవాలి. 

మరి  పాలిచ్చే తల్లులు తినాల్సిన పండ్ల గురించి తెలుసుకుందామా..

విటమిన్-కె, విటమిన్-బి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, నియాసిన్, థియామిన్,ఫోలేట్ పుష్కలంగా ఉండే ఖర్జూజాను తినాలి..

అధిక కేలరీలు ఉండే సపోటాను తీసుకోవాలి..చనుబాలివ్వడం వలన వినియోగించే కేలరీల మొత్తాన్ని సపోటా ద్వారా పొందవచ్చు.

మాంగనీస్, మెగ్నీషియం, రాగి, కాల్షియం, ఇనుము మరియు పొటాషియం వంటి అనేక ఖనిజాలకు అంజీర్ గొప్ప పండు. పాలిచ్చే తల్లికి..బిడ్డ ఆరోగ్యానికి ఎదుగుదలకు తోడ్పడుతుంది.

అవోకాడోలు తల్లీ బిడ్డలిద్దరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బిడ్డకు కంటిచూపు, ఆరోగ్యవంతమైన జుట్టు, గుండె ఆరోగ్యం,జీర్ణశక్తిని పెంపొందించడంలో అవకాడోలు చక్కగా సహాయపడతాయి.

జీర్ణక్రియలో సహాయపడే అరటిపండు తల్లీబిడ్డలకు చక్కగా ఉపయోగపడుతుంది. పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల పాలిచ్చే తల్లులకు అనువైన పండు.

పాలిచ్చే తల్లులకు ఆకుపచ్చ బొప్పాయి చాలా ఉపయోగకరం. తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. తల్లీ, బిడ్డల జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.