మనిషి జీవితంలో ముఖ్యమైనవి రెండే రెండు.. ఒకటి పుట్టుక.. రెండు చావు

పుట్టిన అనంతరం బాల్యం కొంత మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది

మరణం అనంతరం ఖనన సంస్కారాలు లాంటివి కూడా అంతే జరిగిపోతాయి

అయితే, మరణించే ముందు మనిషిలో మార్పులపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు

న్యూరో సైంటిస్ట్‌ల రీసెర్చ్ ప్రకారం మనిషి చనిపోతాడని 30 సెకండ్ల ముందే తెలుస్తుంది

చావుకి 30 సెకండ్ల సమయం ఉందనగా ప్రతి వ్యక్తి గడిచిన జీవితాన్ని ఆలోచిస్తాడట

87 సంవత్సరాల మూర్ఛ వ్యాధి గల వృద్ధుడిపై సైంటిస్ట్‌లు ఈ పరిశోధన చేశారట

అతనికి హార్ట్‌ఎటాక్ తర్వాత బ్రెయిన్ లో ఊహించని యాక్టివిటీని సైటిస్టులు గుర్తించారు

బ్రెయిన్ వేవ్స్‌లో ఆకస్మిక మార్పు జరిగి మెదడు రక్తాన్ని తీసుకోవడం ఆగిపోతుందట 

ఆ సమయంలో అతని జీవితంలో ముఖ్య ఘటనల గురించి ఆలోచించాడని వాళ్ళ రీసెర్చ్

గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకండ్ల తరువాత ఈ ప్రాసెస్ కొనసాగుతుందట