చ‌లికాలంలో విరివిగా దొరికే తేగ‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు.

ర‌సాయ‌నాలు, ఎరువులు వాడ‌కుండానే మొల‌కెత్తుతాయి.

తేగ‌లు రచిక‌రంగానేకాక‌, పోష‌కాలు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

పోటాషియం, విట‌మిన్ బీ1, బీ2, బీ3, విట‌మిన్ సీ ఉంటాయి.

పోష‌కాహార లేమితో బాధ‌ప‌డేవారు రోజూ క‌నీసం ఒక తేగ తీసుకుంటే స‌రి. 

బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి మంచి ఆహారం. 

ఎదిగే పిల్ల‌లు తేగ‌ల్ని తింటే మంచిది. 

ఎముక దృఢ‌త్వాన్ని పెంచుతుంది. 

మ‌హిళల్లో అస్టియో పోరోసిస్ స‌మ‌స్య రాకుండా అడ్డుకుంటుంది. 

తెల్ల ర‌క్త‌క‌ణాల‌ను పెంచుతాయి.

వ్యాధి నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రుస్తాయి. 

కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండె జ‌బ్బుల‌ను దూరం చేస్తాయి.