కొందరు వ్యక్తులు ప్రతీరోజూ షేవింగ్ చేసుకుంటారు.
మిలటరీలో అయితే రెగ్యులర్ షేవింగ్ తప్పనిసరి.
షేవింగ్ ప్రతీరోజూ చేసుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయట.
చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది.
ఉదయం నిద్రలేచి షేవింగ్ చేసుకునే వారు మరింత ఉత్సాహంగా ఉంటారట.
ఉదయాన్నే షేవింగ్ చేసుకోవటం వల్ల ఆ రోజు మీపనిని సమర్థవంతంగా పూర్తిచేస్తారట.
ఈ విషయాలు పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి.
ప్రతీరోజూ షేవింగ్ చేసుకోవటం వల్ల బ్యాక్టీరియా దరిచేరదు.
షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ప్రీషేవ్ ఆయిల్, షేవింగ్ క్రీమ్, జెల్, బామ్ వంటివన్నీ చర్మ పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడానికి సహాయపడతాయి.